Header Banner

మెట్రోకి కొత్త ఊపు! ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ దాకా... 40 కిలోమీటర్లు అదనంగా!

  Fri Apr 11, 2025 21:32        Politics

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం చేపట్టిన మెట్రో రెండో దశలో భాగంగా, ఎయిర్‌పోర్ట్ నుండి ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో రైలు మార్గాన్ని విస్తరించాలని ఆయన ఆదేశించారు. దీనికి సంబంధించిన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయాలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి జరుగుతున్న దృష్ట్యా, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు మెట్రో సేవలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆలోచన. ఈ మార్గానికి సంబంధించిన డీపీఆర్‌ను వెంటనే సిద్ధం చేసి కేంద్రానికి పంపాలని సీఎం సూచించారు.

 

ఈ ప్రాజెక్ట్‌ బాధ్యతను హెచ్‌ఎండీఏ (HMDA) మరియు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FSDA) సంయుక్తంగా చేపట్టాలన్నారు. ఇప్పటికే రూ.24,269 కోట్ల వ్యయంతో 76.4 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు డీపీఆర్ కేంద్రానికి సమర్పించినట్టు వెల్లడించారు. కేవలం మెట్రో ప్రాజెక్ట్ మాత్రమే కాకుండా, రీజినల్ రింగ్ రోడ్ (RRR), జాతీయ రహదారుల అభివృద్ధి పైనా సీఎం సమీక్షించారు. హైదరాబాద్-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ రహదారిని వేగంగా పూర్తి చేయాలని, అలాగే హైదరాబాద్ నుండి రాయ్‌పూర్, మంచిర్యాల వరకు కొత్త జాతీయ రహదారుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సేకరణలో సమస్యలపై సీఎం ఆరా తీశారు. పంటల భూములకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఏర్పడుతున్న ఆటంకాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రీజినల్ రింగ్ రోడ్‌కు సంబంధించి రేడియల్ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మంత్రులకు చంద్రబాబు మార్క్ షాక్! తొలిగింపు లిస్టులో నెక్స్ట్ వారే.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సచివాలయ ఉద్యోగులపై తాజా నిర్ణయం.. నియామక బాధ్యతలు వారీకే! ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ!


రేషన్ కార్డు EKYC పూర్తి చేసుకున్నారా! లేకపోతే అవి రావు! త్వరగా ఇలా చెక్ చేసుకోండి!


పేదల కలలు నెరవేర్చిన లోకేష్.. 1,030 మందికి శాశ్వత ఇంటిపట్టాలు! 5వ రోజు "మన ఇల్లు" కార్యక్రమం!


పోలీసులపై జగన్ వ్యాఖ్యలు హేయం.. క్షమాపణ చెప్పాలి! బీజేపీ అధ్యక్షురాలు ఆగ్రహం!


వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ.. మళ్లీ రిమాండ్ పొడిగింపు!

 

సినీ నటుడు సప్తగిరి ఇంట్లో విషాదం! ఈరోజు తిరుపతిలో అంత్యక్రియలు..

 

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #HyderabadMetro #MetroExpansion #FutureCityMetro #AirportToFutureCity #RevanthReddy #MetroPhase2